అనుకున్నదే జరిగింది.... పాక్ అదుపులో భారత దౌత్య సిబ్బంది... భారత్ ఒత్తిళ్లతో విడుదల
- ఈ ఉదయం అదృశ్యమైన దౌత్య అధికారులు
- ఇస్లామాబాద్ లో ఓ పోలీస్ స్టేషన్ లో ఉన్నట్టు సమాచారం
- హిట్ అండ్ రన్ కేసులో అరెస్టయ్యారని పేర్కొన్న పాక్ మీడియా
ఇద్దరు భారత అధికారులను హిట్ అండ్ రన్ కేసులో అరెస్ట్ చేసినట్టు పాక్ మీడియాలో వచ్చింది. ఈ నేపథ్యంలో భారత్ లో పాకిస్థాన్ రాయబారి సయ్యద్ హైదర్ షాకు హోంమంత్రిత్వ శాఖ సమన్లు పంపింది. ఇస్లామాబాద్ లోని ఇద్దరు భారత దౌత్య సిబ్బంది బాధ్యత పాకిస్థాన్ దేనని, విచారణ పేరుతో వారిపై వేధింపులకు పాల్పడితే సహించబోమని కేంద్రం స్పష్టం చేసింది. ఆ ఇద్దరినీ పూర్తి భద్రత నడుమ భారత హైకమిషన్ కార్యాలయానికి పంపించాలని తెలిపింది.
ఇదిలావుంచితే, భారత్ నుంచి ఒత్తిళ్లు పెరగడంతో వారిద్దరినీ పాక్ విడుదల చేసింది. ప్రస్తుతం వారిద్దరూ భారత హైకమిషన్ కార్యాలయానికి చేరుకున్నట్టు తెలుస్తోంది.