సుశాంత్ ఆత్మహత్య.. చర్చనీయాంశంగా మారిన హెయిర్ స్టైలిస్ట్ సప్న ట్వీట్!

Sushant Singh Rajput was going through a tough time reveals hairstylist Sapna Bhavnani
  • కొన్నేళ్లుగా సుశాంత్ కష్ట కాలాన్ని అనుభవిస్తున్నాడు
  • అతనికి అండగా ఇండస్ట్రీలో ఎవరూ నిలబడలేదు
  • సినీ పరిశ్రమ దారుణ పరిస్థితిలో ఉంది
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యతో బాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన మరణం నేపథ్యంలో నలు వైపుల నుంచి సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. అయితే సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ సప్నా భావ్నాని చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

'కొన్నేళ్లుగా సుశాంత్ కష్ట కాలాన్ని అనుభవిస్తున్నాడనేది అందరికీ తెలుసు. అతనికి అండగా ఇండస్ట్రీలో ఎవరూ నిలబడలేదు. ఆపన్న హస్తాన్ని కూడా ఎవరూ అందించలేదు. సినీ పరిశ్రమ ఎలాంటి పరిస్థితిలో ఉందో చెప్పడానికి ఇదే నిదర్శనం. ఇక్కడ ఉన్న ఎవరూ నీ స్నేహితులు కాదు. నీ ఆత్మకు శాంతి చేకూరాలి' అంటూ సప్న ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Go Back to Shorts
Sushant Singh Rajput
Sapna Bhavnani
Bollywood

More Telugu News