సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యను నమ్మలేకపోతున్న బాలీవుడ్!
- బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణం
- ఇది నిజం కాకూడదని కోరుకుంటున్న బాలీవుడ్ ప్రముఖులు
- గుండె బద్దలైందన్న సోనూ సూద్, నోట మాట రాలేదన్న అక్షయ్
సోనూ సూద్ ఈ ఘటనపై వ్యాఖ్యానిస్తూ, సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసి గుండె బద్దలైందన్నారు. ఇది నిజం కాకపోతే బాగుండు అంటూ తీవ్ర విచారం వెలిబుచ్చారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశారు. సుశాంత్ అద్భుతమైన నటుడు అని, సుశాంత్ ఇక లేడని తెలిసి తీరని వేదన కలిగిందని పేర్కొన్నారు.