నాన్నగారు అందరి ముందు తిట్టేశారు: బాలకృష్ణ
- రేపు బాలయ్య పుట్టినరోజు
- వీరబ్రహ్మేంద్రస్వామి షూటింగ్ సంగతి వెల్లడించిన బాలయ్య
- టేకుల మీద టేకులు తీసుకున్నానని వివరణ
తండ్రి ఎన్టీఆర్ నుంచి క్రమశిక్షణ నేర్చుకున్నానని తెలిపారు. ఆయన తన విషయంలో ఓసారి సహనం కోల్పోయారని, 'వీరబ్రహ్మేంద్రస్వామి..' చిత్రం షూటింగులో టేకుల మీద టేకులు తీసుకుంటుంటే ఎంతో కోప్పడి అందరి ముందూ తిట్టేశారని వెల్లడించారు. అప్పటి నుంచి ఏ పనైనా ఎంతో శ్రద్ధగా చేయడం అలవర్చుకున్నానని బాలకృష్ణ వివరించారు. 1984లో వచ్చిన శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి జీవితచరిత్ర చిత్రంలో బాలకృష్ణ సిద్ధయ్య పాత్ర పోషించారు.