ప్రజారోగ్యంతో ఆటలాడొద్దు.. కోర్టు ఆదేశాలను వెంటనే అమలుపరచండి: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

  • కరోనా టెస్టులపై హైకోర్టు వ్యాఖ్యలపై ఉత్తమ్‌ స్పందన
  • తెలంగాణ సర్కారుపై ధ్వజం
  • హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తారా?
  • మీ ఇష్టమొచ్చినట్టు పాలించడానికి మనం రాచరికంలో లేము
తెలంగాణలో కరోనా పరీక్షల విషయంలో తమ ఆదేశాలు అమలు కావడం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి.. సర్కారుపై విమర్శలు గుప్పించారు.

'కరోనా టెస్టులపై హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తారా? మీ ఇష్టమొచ్చినట్టు పాలించడానికి మనం రాచరికంలో లేము. ప్రజారోగ్యంతో ఆటలాడొద్దు. కోర్టు ఆదేశాలను వెంటనే అమలుపరచండి' అని ఉత్తమ్‌ సూచించారు.

కాగా, కరోనా తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రజల్లో కరోనా ర్యాండమ్‌ టెస్టులు కూడా చేయడం లేదని తెలంగాణ హైకోర్టు మండిపడింది. రక్షణ కిట్లు తగినంత సరఫరా చేయనందుకే వైద్యులకు కరోనా సోకిందని తెలిపింది. కరోనా గురించి బులెటిన్లలో తప్పుడు లెక్కలు ఇస్తే కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని, నిజాలు తెలియకుంటే ప్రజలకు కరోనా తీవ్రత ఎలా తెలుస్తుందని ప్రశ్నించింది. ఈ విషయంపై ఈ నెల 17లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.


More Telugu News