LPG Crisis: వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ సంక్షోభం... కేంద్రం కీలక ప్రకటన
- వంట గ్యాస్‌పై ప్రజల్లో ఆందోళన అవసరం లేదన్న కేంద్రం
- ఎల్పీజీ ఉత్పత్తిని 25 శాతం పెంచాలని చమురు కంపెనీలను ఆదేశం
- ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చమురు దిగుమతి అవుతోందన్న కేంద్రం
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో దేశవ్యాప్తంగా వంట గ్యాస్‌పై ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. బుకింగ్ చేసిన రెండున్నర రోజుల్లో వంట గ్యాస్ సిలిండర్ డెలివరీ అవుతుందని తెలిపింది. ఎల్పీజీ ఉత్పత్తిని 25 శాతం పెంచాలని చమురు కంపెనీలను ఇప్పటికే ఆదేశించినట్లు వెల్లడించింది. పెట్రోల్, డీజిల్, ముడి చమురు, వంట గ్యాస్ సరఫరా విషయంలో ఆందోళన అవసరం లేదని తెలిపింది.
కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. దేశవ్యాప్తంగా ఇంధన సరఫరా సజావుగా సాగేలా చూడాలని సూచించింది. దేశీయ అవసరాలకు కావాల్సిన ముడి చమురులో 75 శాతానికి పైగా హోర్ముజ్ జలసంధికి సంబంధం లేని ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా దిగుమతి చేసుకుంటున్నట్లు తెలిపింది. బ్లాక్ మార్కెట్‌ను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీలు, చీఫ్ సెక్రటరీలను ఆదేశించింది.
గ్లోబల్ షిప్పింగ్ మార్గాల్లో ఆటంకాలు ఉన్నప్పటికీ, భారత్‌కు ముడి చమురు దిగుమతులు నిరంతరాయంగా అందుతున్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. భారత్‌కు చమురు తీసుకువచ్చే అదనపు కార్గో షిప్‌లు కూడా వస్తున్నాయని వెల్లడించారు. పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతున్నప్పటికీ మన దేశంలో ఇంధన అవసరాలకు ఎలాంటి ఇబ్బంది లేదని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.