Posani Krishna Murali: బాలకృష్ణ కోపం నిమిషం మాత్రమే... ఆయన మాటలకు ఎవరూ బాధపడొద్దు: పోసాని

ప్రముఖ సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి మీడియా సమావేశం ఏర్పాటు చేసి అనేక అంశాలపై స్పందించారు. బాలకృష్ణ కోపం నిమిషం మాత్రమేనని, ఆయన మాటలను సీరియస్ గా పట్టించుకుని ఎవరూ బాధపడొద్దని హితవు పలికారు. "బాలయ్య కోపం ఒక్క నిమిషమే, బాలయ్య ఆవేశం ఒక్క నిమిషమే, బాలయ్య విమర్శ చేసినా ఒక్క నిమిషమే... వీటివల్ల సమాజంలో ఎవరికీ నష్టంలేదు. నేను కూడా వీటిని తేలిగ్గానే తీసుకుంటాను. అందరూ అలాగే తీసుకోవాలి" అంటూ హితవు పలికారు. బాలకృష్ణ ఎంతో నిజాయతీ ఉన్న వ్యక్తి అని, తండ్రి సీఎంగా ఉన్నప్పుడు కూడా ఆయన పలుకుబడిని ఉపయోగించుకోలేదని వెల్లడించారు. బాలయ్య డబ్బు కోసం రాజకీయాల్లోకి రాలేదని వివరించారు.

పోసాని ఈ సందర్భంగా బాలయ్యపై కాస్తంత వ్యంగ్యం కూడా ప్రదర్శించారు. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లు అధికారంలో ఉండలేదని బాలయ్య చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని బాలకృష్ణ కలలు కంటున్నాడని, ఇప్పుడు ఏపీ సీఎం ఎన్టీఆర్ కాదని... జగన్ అని స్పష్టం చేశారు. జగన్ ఒకరికి వెన్నుపోటు పొడవడు, తాను పొడిపించుకోడని, కాబట్టి ఐదేళ్లపాటే కాదు, పదేళ్లు సీఎంగా జగనే ఉంటాడని వివరించారు.
Posani Krishna Murali
Balakrishna
Comments
Tollywood

More Telugu News