సుధాకర్ ను శారీరకంగా, మానసికంగా హింసించిన డాక్టర్ రామిరెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయాలి: వర్ల
- ఏపీలో సంచలనం సృష్టించిన డాక్టర్ సుధాకర్ వ్యవహారం
- డాక్టర్ రామిరెడ్డి ఫోన్ కాల్స్ పరిశీలించాలన్న వర్ల
- డాక్టర్ సుధాకర్ వ్యవహారాన్ని జార్జ్ ఫ్లాయిడ్ ఘటనతో పోలిక
మెంటల్ ఆసుపత్రిలో డాక్టర్ సుధాకర్ కు ఇచ్చిన ట్రీట్ మెంట్ ను పొరుగు రాష్ట్రాల వైద్య నిపుణులతో పరీక్ష చేయించాలని అన్నారు. అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ ఘటనకు, రాష్ట్రంలో డాక్టర్ సుధాకర్ వ్యవహారానికి తేడా లేదని, రెండు ఘటనల్లోనూ పోలీసుల వైఖరి ఒకేలా ఉందని విమర్శించారు. జరుగుతున్న సంఘటనలతో దళిత వర్గాలు వైసీపీ సర్కారు పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. డాక్టర్ సుధాకర్ వ్యవహారంతో దళిత జాతి వైసీపీకి దూరమైందని అన్నారు.