Andhra Pradesh: మరోసారి మార్గదర్శకాలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

AP Government released new set of guidelines
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో కరోనా పరిస్థితులు మిగతా రాష్ట్రాలతో పోల్చితే కాస్త ఫర్వాలేదని చెప్పవచ్చు. తాజాగా, కేంద్రం మార్గదర్శకాలను అనుసరించి, రాష్ట్రంలో పాటించాల్సిన విధివిధానాలను ప్రకటించారు. ఈ నూతన మార్గదర్శకాలు జూన్ 8 నుంచి అమల్లోకి రానున్నాయి. కొత్తగా దేవాలయాలు పునఃప్రారంభిస్తుండడం, హోటళ్లు, రెస్టారెంట్లు తెరుస్తుండడంతో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిర్వాహకులు పాటించాల్సిన నియమ నిబంధనలతో కూడిన కొత్త జాబితాను ప్రభుత్వం ఇవాళ విడుదల చేసింది. కేంద్రం నిర్ణయాన్ని గౌరవిస్తూ లాక్ డౌన్ ను ఈ నెల 30 వరకు పొడిగించారు.

తాజా మార్గదర్శకాల జాబితా

  • కంటైన్మెంట్ జోన్లలో అన్ని ఆంక్షలు యథావిధిగా అమల్లో ఉంటాయి.
  • రాష్ట్రంలో దేవాలయాలు, ఇతర ధార్మిక ప్రదేశాలు తెరుచుకోవచ్చు.
  • అయితే, ఆలయాల్లో విగ్రహాలను, పవిత్ర గ్రంథాలను తాకకుండా దర్శనాలు చేసుకోవాలి.
  • తీర్థప్రసాదాలు, పవిత్ర జలాలు భక్తులపై చల్లడం పట్ల నిషేధం.
  • అన్నదానం నిర్వహించాలంటే భౌతికదూరం తప్పనిసరి.
  • ఆలయాల్లో క్యూ లైన్ నిర్వహణ సమర్థవంతంగా ఉండాలి.
  • కంటైన్మెంట్ జోన్ల వెలుపల ఇతర ప్రదేశాల్లో ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాళ్లు తెరుచుకోవచ్చు. (హోటళ్లు, రెస్టారెంట్లలో పార్సిల్ తీసుకెళ్లేందుకే అధిక ప్రాధాన్యత)
  • షాపింగ్ మాల్స్ లో ఉన్న సినిమా థియేటర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవకూడదు.
  • షాపింగ్ మాల్స్ లో ఏసీ 24 డిగ్రీల నుంచి 30 డిగ్రీల మధ్య ఉండేలా చూడాలి.
  • ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లలో 50 శాతం మందికి మాత్రమే ప్రవేశం.
  • హోటళ్లు, రెస్టారెంట్లలో కస్టమర్లు మారిన ప్రతిసారీ టేబుళ్లు, కుర్చీలను శానిటైజ్ చేయాలి.
  • డిజిటల్ చెల్లింపులకు అనుమతి ఉన్న షాపింగ్ మాళ్లు, రెస్టారెంట్లు, హోటళ్లు ఈ-వాలెట్ సౌకర్యం కల్పించాలి.
  • బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయరాదు.
  • 65 ఏళ్లు పైబడిన వ్యక్తులు, 10 ఏళ్ల లోపు చిన్నారులు ఇంటివద్దే ఉండాలి.
  • కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలు విధిగా పాటించాలి.
Go Back to Shorts
Andhra Pradesh
Lockdown
Guidelines
Hotels
Restaurants
Shopping Malls

More Telugu News