కృష్ణా జిల్లాలో దారుణం.. ప్రేమికుడిపై ప్రియురాలి దాడి!
- గత కొంతకాలంగా సహజీవనం
- పెళ్లి చేసుకోవాలంటూ ప్రియుడిపై ఒత్తిడి
- నిరాకరించడంతో కత్తితో దాడి
ఈ క్రమంలో నిన్న సాయంత్రం యువతీయువకులు ఇద్దరూ అపస్మారకస్థితిలో పడి ఉన్నారు. యువకుడి శరీరంపై కత్తిపోట్లు ఉండడంతో గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువతీయువకులు ఇద్దరినీ వేర్వేరు ఆసుపత్రులకు తరలించారు.
ఆసుపత్రిలో యువకుడు మాట్లాడుతూ.. పెళ్లి చేసుకోవాలంటూ ఆమె గత కొన్నాళ్లుగా తనను ఒత్తిడి చేస్తోందన్నాడు. మాట్లాడుకుందామంటే గ్రామానికి వచ్చానని, పెళ్లి చేసుకుని కలిసి బతుకుదామని, లేదంటే కలిసి చనిపోదామని చెబుతూ తనపై కత్తితో దాడిచేసిందని వివరించాడు. ఆ తర్వాత ఆమె నిద్రమాత్రలు మింగిందని పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువతి స్పృహలోకి వస్తే కేసు ఓ కొలిక్కి వస్తుందని పోలీసులు భావిస్తున్నారు.