తుపాకీతో చెవిలో కాల్చుకున్న భర్త.. రెండో చెవిలోంచి దూసుకెళ్లి భార్య మెడలోకి వెళ్లిన బుల్లెట్

gun fire in haryana
  • హర్యానాలోని గురుగ్రామ్‌ పట్టణంలో ఘటన
  • భార్యను తీసుకొని ఆసుపత్రి తీసుకెళ్లిన వ్యక్తి
  • మార్గమధ్యంలో గొడవపడి ఆత్మహత్యాయత్నం
  • భర్త పరిస్థితి విషమం
ఆత్మహత్య చేసుకునేందుకు తుపాకీతో చెవిలో కాల్చుకున్నాడు ఓ భర్త. అయితే, ఆ బుల్లెట్‌ అతడి తల నుంచి రెండో చెవిలోంచి బయటకు వచ్చి పక్కనే ఉన్న అతడి భార్య మెడలోకి కూడా వెళ్లింది. ఈ ఘటన హర్యానాలోని గురుగ్రామ్‌ పట్టణంలో చోటు చేసుకుంది.

గురుగ్రామ్‌లోని రామ్‌పురాలో ఓ వ్యక్తి తన భార్యతో కలిసి అద్దెకు ఉంటున్నాడు. అతడు 2017లో తన మొదటి భార్యను విడిచిపెట్టాడు. 2019లో మధురకు వచ్చి, ఓ దుకాణంలో పనిచేస్తూ.. మరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇంట్లోనే ఉంటూ భార్యతో గొడవపడుతుండేవాడు. అతడి భార్య ఐదు నెలల గర్భవతి. భార్యను తీసుకొని ఆసుపత్రికి ఎస్‌యూవీ కారులో అతడు బయలుదేరాడు.

అయితే, మార్గమధ్యంలో ఉద్యోగ విషయంపై వారిద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో తుపాకీతో చెవిలో కాల్చుకున్నాడు. ఆ బుల్లెట్‌ అతడి రెండో చెవిలో నుంచి బయటి వచ్చి అతని భార్య మెడలోకి దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు వారిద్దరిని ఢిల్లీలోని సప్ధర్‌జంగ్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భర్త ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నాడు. అతడి పరిస్థితి విషమంగా ఉంది.  అతడి భార్య ప్రాణాలతో బయటపడిందని వైద్యులు తెలిపారు.

Go Back to Shorts
Crime News
Haryana
gun

More Telugu News