పవన్ కు రాసిన పాత లేఖను ఫ్రెష్ గా పోస్టు చేసిన వర్మ
Add ap7am to your home Screen

పవన్ కు రాసిన పాత లేఖను ఫ్రెష్ గా పోస్టు చేసిన వర్మ

RGV shares an old letter towards Pawan Kalyan
  • అప్పట్లో 'ఇజం' పుస్తకాన్ని తీసుకువచ్చిన పవన్ కల్యాణ్
  • దానిపై తన అభిప్రాయాలు వెల్లడించిన వర్మ
  • నాటి లేఖను తాజాగా మరోసారి పోస్టు చేసిన వైనం
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సిద్ధాంతాలు, ఆలోచనలతో వచ్చిన 'ఇజం' అనే పుస్తకంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అప్పట్లో ఘాటుగానే స్పందించారు. ఆ మేరకు ఆయన పవన్ కు ఓ లేఖాస్త్రం సంధించారు. నాడు ఆ లేఖ పలు పత్రికల్లో కూడా ప్రచురితమైంది. తాజాగా ఆ లేఖను వర్మ మరోసారి పంచుకున్నారు. పవన్ కు బహిరంగ లేఖ అంటూ ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. పవన్ కల్యాణ్ పుస్తకం 'ఇజం' విడుదలైన సమయంలో తాను ఈ లేఖ రాశానని, అప్పట్లో హైదరాబాద్ టైమ్స్ పత్రికలోనూ ప్రచురితమైందని వర్మ తన తాజా పోస్టులో వెల్లడించారు.

RGV
Pawan Kalyan
Open Letter
ISM
Janasena

More Telugu News