10 exams: తెలంగాణ 10వ తరగతి పరీక్షలు.. షెడ్యూల్ ఇదిగో!

  • జూన్ 8 నుంచి పరీక్షలు ప్రారంభం
  • షెడ్యూల్ విడుదల చేసిన టీఎస్ విద్యాశాఖ
  • హైకోర్టు ఆదేశాలతో ఆగిన పదో తరగతి పరీక్షలు
Telangana 10th exams schedule released

కరోనా కారణంగా మధ్యలో ఆగిపోయిన తెలంగాణ 10వ తరగతి పరీక్షలు వచ్చే నెల నుంచి జరగనున్నాయి. పరీక్షల షెడ్యూల్ ను తెలంగాణ విద్యాశాఖ ప్రకటించింది. జూన్ 8న ఇంగ్లీష్ పేపర్-1, జూన్ 11న ఇంగ్లీష్ పేపర్-2, 14న గణితం పేపర్-1, 17న గణితం పేపర్-2, 20న సైన్స్ పేపర్-1, 23న సైన్స్ పేపర్-2, 26న సోషల్ స్టడీస్ పేపర్-1, 29న సోషల్ స్టడీస్ పేపర్-2 పరీక్షలు జరగనున్నాయి.

గత మార్చి 19న 10వ తరగతి పరీక్షలు మొదలైన సంగతి తెలిసిందే. అయితే కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేయాలని హైకోర్టు ఆదేశించింది. అప్పటికి 3 పరీక్షలు మాత్రమే అయ్యాయి. దీంతో, మిగిలిన 8 పరీక్షలకు రాష్ట్ర విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది.

More Telugu News