పంచాయతీ కార్యాలయాలకు రంగులపై తీర్పు రిజర్వు చేసిన ఏపీ హైకోర్టు
- న్యాయవాది సోమయాజులు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు
- పంచాయతీ భవనాలకు ఇప్పటికీ అవే రంగులు వేస్తున్నారన్న పిటిషనర్
- వాటిని తొలగించమని గతంలోనే ఆదేశించిన విషయాన్ని గుర్తు చేసిన ధర్మాసనం
దీనికి స్పందించిన న్యాయస్థానం.. ఆ రంగులను తొలగించమని గతంలోనే ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేసింది. అయితే, ఈ సమయంలో ప్రభుత్వం తరపు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ.. వాటికి ఏ ఉద్దేశంతో ఆ రంగులు వేస్తున్నామన్న వివరాలను ఉత్తర్వుల్లో పేర్కొన్నట్టు హైకోర్టుకు తెలిపారు. గతంలో వేసిన రంగుతోపాటు అదనంగా మరో రంగును కలిపి వేస్తున్నట్టు న్యాయస్థానానికి తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వులో ఉంచింది.