దసరాకి రావాలనే ఆలోచనలో 'బ్యాచ్ లర్'
- 'బ్యాచ్ లర్' గా రానున్న అఖిల్
- కరోనా కారణంగా రిలీజ్ లేట్
- రిస్క్ చేయవద్దంటున్న అభిమానులు
అందువలన దసరా పండుగకి ఈ సినిమాను బరిలోకి దింపడమే మంచిదనే నిర్ణయానికి గీతా ఆర్ట్స్ వారు వచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు. అయితే లాక్ డౌన్ కారణంగా వాయిదాపడిన చాలా సినిమాలు దసరా సీజన్ పైనే దృష్టి పెట్టాయి. అందువలన అఖిల్ సినిమాకి ఆశించిన స్థాయిలో థియేటర్స్ దొరకడం కష్టమేనని అంటున్నారు. అంతేకాదు మిగతా సినిమాల పోటీని తట్టుకుని అఖిల్ నిలబడవలసి ఉంటుంది. ఇంతవరకూ సరైన హిట్ కొట్టలేకపోయిన అఖిల్, దసరాకి రిస్క్ తీసుకోవడం కరెక్ట్ కాదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.