'బిగ్ బాస్ 4'లో యాంకర్ వర్షిణికి చోటు?
- బిగ్ బాస్ 4'కి సన్నాహాలు
- హోస్ట్ గా మరోసారి నాగార్జున
- ఇంతకుముందే పిలుపొచ్చిందన్న వర్షిణి
ఈ రియాలిటీ షోలో పోటీదారులుగా ఉండవలసిన సభ్యుల కోసం నిర్వాహకులు ఎంపిక ప్రక్రియను ప్రారంభించారట. వాళ్లు తయారు చేసుకున్న జాబితాలో 'అల్లరి' నరేశ్ .. 'సుడిగాలి' సుధీర్ .. నందూ .. తాగుబోతు రమేశ్ .. ఝాన్సీ .. తదితరుల పేర్లు ఉన్నాయని అంటున్నారు. కొంతమందితో సంప్రదింపులు పూర్తికాగా, మరి కొందరితో చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు.
ఇక తాజాగా ఈ జాబితాలో యాంకర్ వర్షిణి పేరు వినిపిస్తోంది. ఈ విషయంపై వర్షిణి స్పందిస్తూ .. "నిజానికి నేను సీజన్ 2 .. సీజన్ 3 లోనే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టవలసి వుంది. కానీ అప్పుడు డేట్స్ సర్దుబాటుకాకపోవడం వలన కుదరలేదు. సీజన్ 4 కోసం నన్ను సంప్రదిస్తే మాత్రం తప్పకుండా వెళతాను" అని చెప్పుకొచ్చింది.