KTR: సిరిసిల్ల మగ్గం మళ్లీ కదిలింది: కేటీఆర్
సిరిసిల్ల చేనేత సోదరులు, సోదరీమణుల ప్రతిభ పట్ల తాను ఎంతో గర్విస్తున్నానని తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. సిరిసిల్లలో చేనేత పని పునఃప్రారంభమైందని, బతుకమ్మ చీరలు నేయడం కొనసాగిస్తున్నారని ట్వీట్ చేశారు. సిరిసిల్ల చేనేత ఉత్పత్తులంటే ఓ ఎన్నదగిన బ్రాండ్ గా అభివృద్ధి చేయడమే స్థానిక ఎమ్మెల్యేగా తన లక్ష్యమని కేటీఆర్ వివరించారు. ఈ స్వప్నం సాకారమవ్వాలంటే టెక్స్ టైల్ పార్క్, అప్పెరెల్ పార్క్ ఎంతో కీలకమని అభిప్రాయపడ్డారు.