Mahesh Babu: కాలేజ్ స్టూడెంట్ గా కనిపించనున్న మహేశ్ బాబు?

Mahesh as college stundent in Parashuram Movie
షార్ట్స్‌లో చూడండి
కొంతకాలంగా మహేశ్ బాబు టైమ్ నడుస్తోంది. ఆయన చేసిన సినిమాలు భారీ విజయాలను నమోదు చేస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే దర్శకుడు పరశురామ్ తో కలిసి సెట్స్  పైకి వెళ్లడానికి ఆయన సిద్ధమవుతున్నాడు.  మహేశ్ బాబు వరుసగా సామాజిక సమస్యలతో ముడిపడిన కథలను చేస్తూ వస్తున్నాడు. దాంతో వాటిల్లో హీరోయిన్ పాత్రలకి .. ఆమెతో ప్రేమ ప్రయాణానికి సంబంధించిన నిడివి చాలా తక్కువగా ఉంటూ వస్తోంది.

అందువలన ఈ సారి ప్రేమపాళ్లు పెంచనున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో మహేశ్ బాబును కొంతసేపు కాలేజ్ స్టూడెంట్ గా పరశురామ్ చూపించనున్నాడని అంటున్నారు. ఇంతకుముందు 'శ్రీమంతుడు' .. 'భరత్ అనే నేను' .. 'మహర్షి'  సినిమాల్లో కాలేజ్ స్టూడెంట్ గా మహేశ్ బాబు కనిపించిన సంగతి తెలిసిందే. అలాగే పరశురామ్ కూడా స్టూడెంట్ గా మరింత యంగ్ లుక్ తో మహేశ్ బాబును చూపించనున్నాడని చెబుతున్నారు.  ఇందుకోసం  మహేశ్ బాబు కొంత బరువు తగ్గుతున్నాడని అంటున్నారు. సంక్రాంతి బరిలోకి ఈ సినిమాను దింపే ఆలోచనలో వున్నారు.
Go Back to Shorts
Mahesh Babu
Parashuram
Tollywood

More Telugu News