రామ్ చరణ్ 'పెద్ది' సినిమా కథకు సంబంధించి కీలక హింట్ ఇచ్చిన బొమన్ ఇరానీ

Ram Charan Peddi Movie Story Hint by Boman Irani
  • రామ్ చరణ్, జాన్వీ కపూర్, బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న 'పెద్ది'
  • ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన బొమన్ ఇరానీ
  • సినిమాలో స్పోర్ట్స్ డ్రామాతో పాటు గుండెకు హత్తుకునే దేశభక్తి అంశాలు ఉంటాయన్న బొమన్ ఇరానీ

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవెయిటెడ్ పాన్ ఇండియా మూవీ 'పెద్ది' విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా గురించి బాలీవుడ్ ప్రముఖ నటుడు బొమన్ ఇరానీ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ అవుతున్నాయి. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రంలో ఆయన ఒక కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఒక స్పెషల్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా... తాజాగా బొమన్ ఇరానీ సినిమా కథాంశంపై ఒక ముఖ్యమైన హింట్ ఇచ్చారు.


బొమన్ ఇరానీ మాట్లాడుతూ.. "'పెద్ది' చాలా అద్భుతమైన సినిమా. రామ్ చరణ్ ఎంతో గొప్ప నటుడు. చాలామంది ఈ చిత్రాన్ని కేవలం స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సాధారణ కమర్షియల్ మూవీగా భావిస్తున్నారు. కానీ, ఇందులో ప్రేక్షకులను అలరించే స్పోర్ట్స్ డ్రామాతో పాటు, అంతర్లీనంగా గుండెలను హత్తుకునే బలమైన దేశభక్తి అంశాలు కూడా ఉంటాయి. ఇదొక కంప్లీట్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్" అని కొనియాడారు. బొమన్ ఇరానీ చెప్పిన ఈ పాయింట్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.


జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ భారీ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, వృద్ధి సినిమాస్ పతాకంపై మైత్రీ మూవీ మేకర్స్ భాగస్వామ్యంతో ఈ సినిమా తెరకెక్కింది. క్రీడా నేపథ్యానికి దేశభక్తి తోడవడమనేది రామ్ చరణ్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Go Back to Shorts
Ram Charan
Peddi
Boman Irani
Buchi Babu Sana
Janhvi Kapoor
AR Rahman
Mythri Movie Makers
Sports drama
Patriotism
Pan India movie

More Telugu News