బోయపాటి సినిమాలో కీలక పాత్రలో సీనియర్ హీరో

Senior hero in Boyapati Movie
  • బాలకృష్ణతో బోయపాటి మూడో మూవీ
  •  మరోసారి తొట్టెంపూడి వేణుకు అవకాశం
  • బాలయ్య జోడీగా కొత్త కథానాయిక పరిచయం  
బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ కథానాయకుడిగా ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. లాక్ డౌన్ ను తొలగించగానే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర ఉందట. ఆ పాత్రను సీనియర్ హీరోలలో ఎవరైనా చేస్తే బాగుంటుందని భావించిన బోయపాటి, చివరికి తొట్టెంపూడి వేణును ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది.

గతంలో ఎన్టీఆర్ హీరోగా బోయపాటి తెరకెక్కించిన 'దమ్ము' సినిమాలోను వేణు ఒక ముఖ్యమైన పాత్రను చేశాడు. మళ్లీ ఇంతకాలానికి ఆయనకి బోయపాటి అవకాశం ఇచ్చాడు. డైలాగ్స్ ను ఫాస్టుగా చెప్పే హీరోగా వేణుకి మంచి గుర్తింపు ఉండేది. బోయపాటి సినిమాలో ఆయన పాత్రకి ప్రత్యేకమైన స్థానం ఉంటుందని అంటున్నారు.  ఇక ఈ సినిమా ద్వారా బోయపాటి కొత్త హీరోయిన్ ను పరిచయం చేస్తుండటం విశేషం. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తుండటం మరో విశేషం.  
Go Back to Shorts
Balakrishna
Tottempudi Venu
Boyapati Sreenu

More Telugu News