తెలంగాణలో ఇవాళ మరో 15 కరోనా కేసులు వెల్లడి
Add ap7am to your home Screen

తెలంగాణలో ఇవాళ మరో 15 కరోనా కేసులు వెల్లడి

Fifteen new cases in Telangana
  • జీహెచ్ఎంసీ పరిధిలో 12 కొత్త కేసులు
  • ముగ్గురు వలస కార్మికులకు కరోనా పాజిటివ్
  • ఇవాళ 45 మంది డిశ్చార్జి
తెలంగాణలో ఇవాళ కొత్తగా 15 కరోనా కేసులు నమోదయ్యాయి. వాటిలో 12 జీహెచ్ఎంసీ పరిధిలోనివే. మరో మూడు కేసులు వలస కార్మికులవిగా గుర్తించారు. దాంతో ఇప్పటివరకు తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 1122కి చేరింది. 693 మంది కోలుకుని డిశ్చార్జి కాగా, 400 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇవాళ 45 మందిని డిశ్చార్జి చేశారు. ఇక, మరణాల సంఖ్య 29గా ఉంది. రాష్ట్రంలో వరంగల్ రూరల్, యాదాద్రి, వనపర్తి జిల్లాల్లో ఇప్పటిదాకా ఒక్క పాజిటివ్ కేసు కూడా లేదు.
Telangana
Corona Virus
Positive Cases
Discharge
Active Cases
COVID-19

More Telugu News