తెలంగాణలో ఈరోజు కొత్తగా 11 కరోనా పాజిటివ్ కేసుల నమోదు
Add ap7am to your home Screen

తెలంగాణలో ఈరోజు కొత్తగా 11 కరోనా పాజిటివ్ కేసుల నమోదు

Today 11 new corona cases confirmed in Telangana
  • 1,107కు చేరుకున్న కేసుల సంఖ్య
  • ఈరోజు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20
  • ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 430
తెలంగాణలో ఈరోజు కొత్తగా 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నీ జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదు కావడం గమనార్హం. కొత్త కేసులతో కలిపితే రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,107కు చేరుకుంది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 430. ఈరోజు 20 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 648కి పెరిగింది. ఈ వివరాలను ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.
Corona Virus
Cases
Telangana

More Telugu News