‘కరోనా’ను అంతమొందించే యాంటీ బాడీ సిద్ధం: ఇజ్రాయెల్ రక్షణ మంత్రి నెఫ్తాలీ బెన్నెట్
- యాంటీబాడీ పేటెంట్ కోసం ఐఐబీఆర్ చర్యలు చేపట్టింది
- ఆ తర్వాత పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తాం
- అందుకోసం అంతర్జాతీయ తయారీ సంస్థలను సంప్రదిస్తాం
- ఈ ఘనతను మా పరిశోధకులు సాధించడం గర్వకారణం
కాగా, ఐఐబీఆర్ పరిశోధన శాలలను రెండు రోజుల క్రితం బెన్నెట్ పరిశీలించిన విషయాన్ని తెలియజేస్తూ ఇజ్రాయెట్ పీఎంఓ ఒక ప్రకటన విడుదల చేేసింది. వైరస్ పై దాడి చేసే యాంటీబాడినీ బెన్నెట్ పరిశీలించారని తెలిపింది. ఐఐబీఆర్ సంస్థ పీఎంఓ పర్యవేక్షణలో పని చేస్తుంది. గత ఫిబ్రవరిలో జపాన్, ఇటలీ, ఇతర దేశాల నుంచి వైరస్ శాంపిల్స్ ను ఇజ్రాయెల్ కు తెప్పించారు. మైనస్ 80 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఆ శాంపిల్స్ భద్రపరిచారు. అప్పటి నుంచి వ్యాక్సిన్ అభివృద్ధికి నిపుణుల బృందం కృషి చేస్తోంది.