Disha Pathani: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

Disha Pathani to do item song in Bunny flick
షార్ట్స్‌లో చూడండి
 *  సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న 'పుష్ప' సినిమా కోసం ఓ ఐటెం సాంగును కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో బన్నీతో కలసి బాలీవుడ్ భామ దిశా పటానీ నటించే అవకాశం వుందని, ప్రస్తుతం ఆమెతో సంప్రదిస్తున్నారని తెలుస్తోంది.  
*  నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న 'లవ్ స్టోరీ' చిత్రానికి సంబంధించి ఇక పదిహేను రోజుల షూటింగ్ మాత్రం బ్యాలెన్స్ గా వుంది. లాక్ డౌన్ పూర్తయిన తర్వాత డేట్స్ సర్దుబాటును బట్టి జూలైలో ఈ షూటింగును పూర్తిచేశారట.  
*  అల్లు శిరీశ్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. ప్రస్తుతం అఖిల్ హీరోగా తాను రూపొందిస్తున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చిత్రం విడుదలయ్యాక తన తదుపరి చిత్రాన్ని భాస్కర్ శిరీశ్ తో చేస్తాడట. ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది.
Go Back to Shorts
Disha Pathani
Bunny
Naga Chaitanya
Sai Pallavi

More Telugu News