Eatala: కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా సడలింపులు ఉంటాయి: ఈటల

Eatala Rajendar tells Telangana will follow Centre guidelines
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, రాష్ట్రంలో కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా సడలింపులు ఉంటాయని స్పష్టం చేశారు. గ్రీన్ జోన్లలో వ్యవసాయ కార్యకలాపాలకు అడ్డంకుల్లేవని తెలిపారు. 6 జిల్లాలు రెడ్ జోన్ లో ఉన్నాయని, వాటి మినహా ఎలాంటి సడలింపులు ఉండాలన్నదీ సీఎం కేసీఆర్ క్యాబినెట్ సమావేశంలో చర్చిస్తారని ఈటల వివరించారు. మరో ప్రశ్నకు సమాధానమిస్తూ, రవాణా విషయంలో భారత ప్రభుత్వమే కొంత సడలింపు ఇచ్చిందని, ఏ రాష్ట్రం కూడా రవాణాను ఆపొద్దంటూ స్పష్టం చేసిందని అన్నారు. అందుకు అనువుగానే తెలంగాణ రాష్ట్రంలోనూ రవాణా కొనసాగుతుందని తెలిపారు.
Go Back to Shorts
Eatala
Telangana
Corona Virus
Lockdown
Guidelines

More Telugu News