ఎయిర్ పోర్టు రన్ వేపై తృటిలో ప్రమాదం తప్పించుకున్న హాలీవుడ్ దిగ్గజం
- ఏటీసీ సూచనలు తప్పుగా అర్థం చేసుకున్న హ్యారిసన్ ఫోర్డ్
- ల్యాండింగ్ కు యత్నించిన మరో విమానం
- అదే సమయంలో రన్ వేపై ఫోర్డ్ నడుపుతున్న విమానం
అధికారులు చెప్పిన సూచనలను తాను పూర్తి విరుద్ధంగా, తప్పుగా అర్థం చేసుకున్నానని ఫోర్డ్ వివరణ ఇచ్చారు. ఈ మేరకు అధికారులకు క్షమాపణలు తెలియజేశారు. స్వతహాగా పైలెట్ అయిన హ్యారిసన్ ఫోర్డ్ గతంలోనూ అనేక సార్లు విమాన ప్రమాదాల నుంచి బయటపడ్డారు. 'ఇండియానా జోన్స్' సిరీస్ చిత్రాలతో ఫోర్డ్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.