బజాజ్ ఆటో త్రైమాసిక ఫలితాలు వాట్సాప్లో లీక్.. ఇద్దరికి రూ. 30 లక్షల జరిమానా!
- కొన్ని సంస్థల షేర్ల ధరలను ప్రభావితం చేసేలా సమాచారం లీక్
- దర్యాప్తు చేపట్టిన సెబీ
- ఇద్దరికి చెరో రూ. 15 లక్షల చొప్పున జరిమానా
దీనిపై విచారణ జరిపి 26 వాట్సాప్ గ్రూపుల్ని, 190 పరికరాలను జప్తు చేసి విశ్లేషించగా మొత్తం 12 కంపెనీల ఫలితాలు, ఆర్థిక సమాచారం వాట్సాప్ ద్వారా లీక్ అయినట్టు గుర్తించింది. ఈ లీకుల్లో బజాజ్ ఆటోకు చెందిన ఆర్థిక ఫలితాలు చాలా దగ్గరగా ఉండడంతో మరింత లోతుగా దర్యాప్తు ప్రారంభించిన సెబీ.. నీరజ్ కుమార్ అగర్వాల్, శ్రుతి విశాల్ ఓరాలే ఈ పనికి పాల్పడినట్టు నిర్ధారించింది. దీంతో వీరిద్దరికీ చెరో రూ. 15 లక్షల చొప్పున జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది.