ఇక నేరుగా హైకోర్టులోనే విచారణ జరుపుతాం: నిమ్మగడ్డ వ్యాజ్యంపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం
- ఎస్‌ఈసీ పదవీకాలం కుదింపుపై విచారణ
- విచారణ సోమవారానికి వాయిదా
- భౌతిక దూరం పాటిస్తూ సోమవారం విచారణ
- పిటిషనర్లు, న్యాయవాదులకు హైకోర్టు ప్రత్యేక పాసులు జారీ
సోమవారం నేరుగా హైకోర్టులోనే విచారణ జరగనుంది. బౌతిక దూరం పాటిస్తూ విచారణకు అందరూ సహకరించాలని ఆదేశించింది. కేసుకు సంబంధించిన న్యాయవాదులను మాత్రమే అనుమతిస్తామని తెలిపింది. ఇందుకోసం పిటిషనర్లు, న్యాయవాదులకు హైకోర్టు ప్రత్యేక పాసులు జారీ చేస్తామని, సదరు పాస్‌లు ఇవ్వాల్సిందిగా డీజీపీకి లేఖ రాస్తామని పేర్కొంది.
కాగా, విచారణ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్‌లోకి ఇతరులు రావడంపై హైకోర్టు చివాట్లు పెట్టినట్లు తెలిసింది. ఒకేసారి 40 మంది వీడియో కాన్ఫరెన్స్‌లోకి ఎలా వచ్చారని ప్రశ్నించింది. వీడియో కాన్ఫరెన్స్‌లోకి ఎంటర్ అయ్యే పాస్‌వర్డ్ లీక్ చేయడం వల్లే ఇలా జరుగుతుందని పేర్కొంది.