కిమ్ బతికే ఉన్నాడు... బలంగా నమ్ముతున్న దక్షిణ కొరియా
- ఉత్తర కొరియా అధినేతపై ఊహాగానాలు
- చనిపోయాడని, బ్రెయిన్ డెడ్ అయ్యాడని కథనాలు
- కిమ్ ఆరోగ్యంగానే ఉన్నాడంటున్న దక్షిణ కొరియా
కిమ్ బతికే ఉన్నాడని నమ్ముతున్నామని, ఆయన ఆరోగ్యంపై ఎలాంటి సందేహాలు లేవని తెలిపారు. కిమ్ కు ఏమీ కాలేదని దక్షిణ కొరియా ప్రభుత్వం కూడా విశ్వసిస్తోందని పేర్కొన్నారు. కిమ్ ఏప్రిల్ 13 నుంచి వోన్ సాన్ ప్రాంతంలో ఉంటున్నట్టు తెలిసిందని, ఎలాంటి అనుమానాస్పద కదలికలు కూడా తమ దృష్టికి రాలేదని వివరించారు.
కాగా, తాజాగా కిమ్ వ్యక్తిగత రైలు వోన్ సాన్ ప్రాంతంలోనే నిలిచి ఉన్న శాటిలైట్ ఫొటోలు ఓ అమెరికా వెబ్ సైట్ లో వెల్లడయ్యాయి. కిమ్ చివరగా బహిరంగంగా కనిపించింది ఏప్రిల్ 11నే. పార్టీ సమావేశంలో పాల్గొన్న తర్వాత నుంచి కిమ్ మళ్లీ ఎక్కడా దర్శనమివ్వకపోవడంతో ఆయన పరిస్థితిపై తీవ్రస్థాయిలో ఊహాగానాలు బయల్దేరాయి.