‘కరోనా’ రహిత రాష్ట్రంగా మణిపూర్ అవతరించింది: సీఎం బీరేన్ సింగ్

No corona virus cases in Manipur
  • ఈశాన్య రాష్ట్రం మణిపూర్
  • ఈ వైరస్ బారినపడ్డ వాళ్లందరూ పూర్తిగా కోలుకున్నారు
  • కొత్త కేసులు నమోదు కాలేదు
ఈశాన్య  రాష్ట్రాల్లో ఒకటైన మణిపూర్ ‘కరోనా’ రహిత రాష్ట్రంగా అవతరించింది. ఈ విషయాన్ని మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బీరేన్ సింగ్ తెలిపారు. ‘కరోనా’ రహిత రాష్ట్రంగా మణిపూర్ అవతరించిందని చెప్పడానికి తాను సంతోషిస్తున్నానని ఈ వైరస్ బారినపడ్డ వాళ్లందరూ పూర్తిగా కోలుకున్నారని, వారికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో ‘నెగిటివ్’ వచ్చిందని చెప్పారు. కొత్త కేసులు ఏవీ నమోదు కాలేదని అన్నారు. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు కఠినంగా అమలు చేస్తున్న లాక్ డౌన్, ప్రజలు, వైద్య సిబ్బంది సహకారం వల్లనే కరోనా రహిత రాష్ట్రంగా మణిపూర్ అవతరించిందని బీరేన్ సింగ్ పేర్కొన్నారు.
Go Back to Shorts
Manipur
Corona Virus
Green Zone
Cm
BIren singh

More Telugu News