తైవాన్ ఆరోగ్యశాఖ నుంచి గత డిసెంబర్లోనే ఈమెయిల్ వస్తే డబ్ల్యూహెచ్ఓ ఎందుకు పట్టించుకోలేదు?: ట్రంప్
- డబ్ల్యూహెచ్ఓపై నిప్పులు కురిపిస్తున్న ట్రంప్
- వార్షిక నిధుల నిలిపివేత
- తాజాగా ట్విట్టర్ లో ప్రశ్నాస్త్రాలు
కరోనా వైరస్ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అనేక ప్రకటనలు చేసిందని, అవన్నీ తప్పుల తడకలు, తప్పుదారి పట్టించేవిగానే ఉన్నాయని, ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందంటూ మండిపడ్డారు. ఈ మేరకు ట్రంప్ ట్వీట్ చేశారు. జనవరి, ఫిబ్రవరిలో వైరస్ శరవేగంగా విస్తరిస్తుంటే నిర్ణయాత్మక ప్రకటన చేసేందుకు డబ్ల్యూహెచ్ఓ ఎందుకంత సమయం తీసుకోవాల్సి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు.