కొత్త కిట్ తో కరోనా టెస్టులు చేయించుకున్న సీఎం జగన్!
Add ap7am to your home Screen

కొత్త కిట్ తో కరోనా టెస్టులు చేయించుకున్న సీఎం జగన్!

Medics conducts corona tests on CM Jagan with rapid testing kit
  • ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ తో సీఎంకు కరోనా పరీక్షలు
  • సీఎం జగన్ కు నెగెటివ్
  • పది నిమిషాల్లోనే ఫలితాన్నివ్వగల ర్యాపిడ్ టెస్టింగ్ కిట్
దక్షిణ కొరియా నుంచి ఏపీ ప్రభుత్వం లక్ష కరోనా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను దిగుమతి చేసుకున్న సంగతి తెలిసిందే. సీఎం జగన్ ఆ కిట్లను తన కార్యాలయం నుంచి ప్రారంభించారు. ఈ నేపథ్యంలో, వైద్యులు సీఎం జగన్ కు ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ ను ఉపయోగించి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలో నెగెటివ్ వచ్చింది. ఈ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ సాయంతో కేవలం పది నిమిషాల్లోనే కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించవచ్చు. ఈ కిట్లను జిల్లాలకు పంపి సామూహిక పరీక్షలు చేపట్టాలన్నది ప్రభుత్వ యోచన. తద్వారా కరోనా వ్యాప్తిని త్వరితగతంగా అరికట్టవచ్చని ఏపీ సర్కారు భావిస్తోంది.
Jagan
Corona Virus
Rapid Testing Kit
Negative
Andhra Pradesh
South Korea

More Telugu News