కరోనా వ్యాక్సిన్ తయారీలో కీలక ముందడుగు... ఎలుకల్లో పెరిగిన వ్యాధి నిరోధక శక్తి
- కరోనా వైరస్ విజృంభణ
- వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమైన పిట్స్ బర్గ్ వర్సిటీ
- ఎలుకలపై వ్యాక్సిన్ ప్రయోగం
- కరోనా వైరస్ కు వ్యతిరేకంగా ఉప్పెనలా పుట్టుకొచ్చిన యాంటీబాడీలు
ప్రయోగదశలో భాగంగా కొన్ని ఎలుకలకు ఈ వ్యాక్సిన్ ఇవ్వగా, వాటిలో కరోనా వైరస్ కు వ్యతిరేకంగా ఉప్పెనలా యాంటీబాడీలు పుట్టుకొచ్చాయి. కరోనా వ్యతిరేక వ్యాక్సిన్ తయారీలో స్పైక్ ప్రొటీన్ కీలకంగా మారిందని, వ్యాధి నిరోధక శక్తిని ఇనుమడింపచేయడంలో ఈ ప్రొటీన్ ముఖ్యమైనదని పిట్స్ బర్గ్ యూనివర్సిటీ పరిశోధకురాలు ఆండ్రియా గంబోటో తెలిపారు. ఈ వైరస్ ను ఎలా ఎదుర్కోవాలో తమకు తెలిసిందని ఆమె వివరించారు.
వర్సిటీకి చెందిన మరో పరిశోధకుడు లూయిస్ ఫాలో స్పందిస్తూ, ఈ వ్యాక్సిన్ ను రోగులపై ప్రయోగించే ప్రక్రియకు కనీసం ఏడాదికిపై పైగా పడుతుందని, అయితే, ఎన్నడూ చూడని ఇలాంటి పరిస్థితుల్లో ఈ వ్యాక్సిన్ ప్రయోగదశను ఎప్పుడు దాటుతుందన్నది ఇప్పుడే చెప్పలేమని అన్నారు.