అమెరికాలో లక్ష మృతదేహాల కోసం బాడీ బ్యాగులు కోరిన ఫెమా!
- అమెరికాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2.45 లక్షలు
- 6 వేల మందికి పైగా మృతి
- నిన్న ఒక్కరోజే 1100 మంది బలి
- లక్ష బాడీ బ్యాగులు కావాలని సైన్యాన్ని కోరిన ఫెమా
రానున్న మరికొన్ని వారాల్లో అమెరికాలో కరోనా స్వైరవిహారం చేస్తుందని, అపార జననష్టం తప్పదని భావిస్తున్నారు. నిన్న ఒక్కరోజే అమెరికాలో 1100 మందికి పైగా మృతి చెందడం అక్కడి పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చెబుతోంది. కరోనా బాధితుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుండడం పట్ల ఆందోళనతో ఉన్న వైట్ హౌస్ వర్గాలు, అమెరికాలో రెండు లక్షల మంది వరకు కరోనా మహమ్మారికి బలవుతారని అంచనా వేస్తున్నాయి.