రామ్ చరణ్, నా మాట నిలబెట్టుకున్నా... ఇదిగో గిఫ్టు: జూనియర్ ఎన్టీఆర్
- ఇవాళ రామ్ చరణ్ బర్త్ డే
- గిఫ్ట్ ఇస్తానంటూ నిన్నటి నుంచి ఊరిస్తున్న ఎన్టీఆర్
- ఎట్టకేలకు రామ్ చరణ్ ఫస్ట్ లుక్ ను షేర్ చేసిన వైనం
అయితే, ఇవాళ ఉదయం మరలా, అయ్యో చరణ్ ఆ గిఫ్ట్ రాజమౌళి వద్దకు చేరిందంటూ ఉడికించాడు. మధ్యలో మెగాస్టార్ చిరంజీవి సైతం రంగప్రవేశం చేసి మరీ ఇంత నిరాశకు గురిచేస్తారా అంటూ చిరుకోపం ప్రదర్శించారు. ఎట్టకేలకు జూనియర్ ఎన్టీఆర్ తన మాట నిలుపుకున్నాడు. దీనిపై ఎన్టీఆర్ స్పందిస్తూ, "నేను మాటిచ్చిన విధంగా ఇదిగో నా కానుక. అందుకో రామ్ చరణ్! హ్యాపీ బర్త్ డే బ్రదర్. మన అనుబంధం ఎప్పటికీ ఇలాగే నిలవాలి" అంటూ ట్వీట్ చేశాడు.