వెనిజులా అధ్యక్షుడిపై అమెరికా తీవ్ర అభియోగాలు.. ఆయన తలపై 15 మిలియన్ డాలర్ల రివార్డు
- అధ్యక్షుడు మాడ్యురో, ఆయన అధికారులపై అమెరికా తీవ్ర అభియోగాలు
- రుజువైతే గరిష్టంగా జీవిత ఖైదు
- అమెరికాపై మండిపడిన వెనిజులా
మాడ్యురో, ఆయన ప్రభుత్వంలోని అధికారులపై డ్రగ్ ట్రాఫికింగ్, నార్కో టెర్రరిజం కింద అమెరికా అభియోగాలు మోపింది. ఈ అభియోగాలు రుజువైతే 50 ఏళ్ల నుంచి జీవితకాలం శిక్ష పడే అవకాశం ఉంది. అయితే, అమెరికా ఆరోపణలను వెనిజులా విదేశాంగ మంత్రి జార్జి అరియాజా తీవ్రంగా ఖండించారు. డ్రగ్ ట్రాఫికింగ్‌కు వ్యతిరేకంగా తాము చేస్తున్న పోరును తక్కువ చేసి చూపేందుకే అమెరికా ఇలాంటి వికృత పంథాను ఎంచుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెనిజులా ప్రభుత్వాన్ని కూల్చేందుకు ట్రంప్ సర్కారు చేస్తున్న ప్రయత్నాలు ఎట్టిపరిస్థితుల్లోనూ ఫలించవని ఆయన తేల్చి చెప్పారు.