తనయుడికి కరోనా.. కొత్తగూడెం డీఎస్పీపై కేసు నమోదు!

  • లండన్ నుంచి వచ్చిన డీఎస్పీ కుమారుడు
  • డీఎస్పీ కుమారుడికి కరోనా పాజిటివ్
  • విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారంటూ డీఎస్పీపై చర్యలు
తెలంగాణలో లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన తన కుమారుడికి కరోనా పాజిటివ్ అని తేలినా, క్వారంటైన్ లో ఉంచకుండా తీసుకెళ్లిన కొత్తగూడెం డీఎస్పీపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. 1897 అంటువ్యాధుల నివారణ చట్టం కింద ఆ డీఎస్పీపై కేసు నమోదు చేశారు.

డీఎస్పీ కుమారుడు ఇటీవలే లండన్ నుంచి వచ్చాడు. అయితే ఆ యువకుడికి కరోనా ఉన్నట్టు తేలింది. నిబంధనల ప్రకారం తన కుమారుడ్ని క్వారంటైన్ లో ఉంచాలి. కానీ ఆయన విధి నిర్వహణను పక్కనబెట్టి కుమారుడ్ని నివాసానికి తీసుకెళ్లినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ డీఎస్పీ కుటుంబానికి కూడా వైద్యపరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇటీవల ఆ డీఎస్పీ కుటుంబం ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్నట్టు సమాచారం.


More Telugu News

Kothagudem DSP Police Corona Virus Positive Quarantine Centre Telangana