Eggs: రూపాయి మాత్రమే... ఆర్మూరులో వెరీ 'గుడ్డు' ఆఫర్!

కరోనా భయంతో ప్రజలు మాంసాహారంతో పాటు గుడ్డుకు కూడా దూరం కావడంతో, పెరిగిపోతున్న నిల్వలను తగ్గించుకునేందుకు వ్యాపారులు నానా తంటాలూ పడుతున్నారు. ఆర్మూరు పట్టణంలో కోడిగుడ్డు నిల్వలు పెరిగిపోగా, ఓ వ్యాపారి ఒక్కో గుడ్డును రూపాయికి విక్రయిస్తున్నాడు. స్థానిక బృందావనం థియేటర్ సమీపంలో 100 రూపాయలకు వంద గుడ్లు అని అతను ప్రచారం చేస్తున్నాడు. దీంతో ఆసక్తి ఉన్న ప్రజలు గుడ్లను తీసుకుని వెళుతున్నారు. గుడ్డు తిన్నా కరోనా వస్తుందన్న పుకార్లతోనే వ్యాపారం పడిపోయిందని సదరు వ్యాపారి ఈ సందర్భంగా వాపోయాడు.
Eggs
Price
Corona Virus

More Telugu News