అభిమానికి క్షమాపణ చెప్పిన వరుణ్ ధావన్.. నెట్టింట ప్రశంసల వర్షం
- లక్నోలో అభిమానులను కలవలేకపోయిన వరుణ్ ధావన్
- 5 గంటలు చూస్తే 5 నిమిషాల్లో వెళ్లారంటూ అభిమాని ఆవేదన
- పోలీసుల వల్లే త్వరగా వెళ్లాల్సి వచ్చిందని హీరో వివరణ
- అభిమానికి క్షమాపణ చెప్పిన వరుణ్ తీరుపై ప్రశంసలు
బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ తన అభిమాని పట్ల చూపిన చొరవ, చెప్పిన క్షమాపణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లక్నోలో జరిగిన ఓ ప్రమోషనల్ ఈవెంట్‌లో తనను కలవడానికి గంటల తరబడి ఎదురుచూసిన ఓ అభిమానిని కలవలేకపోయినందుకు ఆయన బహిరంగంగా విచారం వ్యక్తం చేశారు. హీరో స్పందించిన తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
వరుణ్ ధావన్, ఆయన తండ్రి డేవిడ్ ధావన్ కాంబినేషన్‌లో వస్తున్న 'హై జవాని తో ఇష్క్ హోనా హై' సినిమా ప్రమోషన్ల కోసం చిత్రబృందం ఇటీవల లక్నోలో పర్యటించింది. ఈ కార్యక్రమంలో వరుణ్‌తో పాటు నటి మృణాల్ ఠాకూర్ కూడా పాల్గొన్నారు. తమ అభిమాన హీరోను చూసేందుకు ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. అయితే, ఓ మహిళా అభిమాని.. తాము 5 గంటల పాటు ఎదురుచూస్తే, వరుణ్ కేవలం 5 నిమిషాల్లోనే వెళ్లిపోయారంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేసి తన నిరాశను వ్యక్తం చేసింది.
ఈ పోస్ట్ వైరల్ అవ్వడంతో వరుణ్ ధావన్ వెంటనే స్పందించారు. అదే పోస్ట్‌కు బదులిస్తూ.. "క్షమించండి, నేను మీకు ఆటోగ్రాఫ్ ఇవ్వలేకపోయాను. పోలీసులు మమ్మల్ని కాస్త ముందుగానే అక్కడినుంచి పంపించేశారు" అని వివరణ ఇచ్చారు. దీంతో పాటు, ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో మరో వీడియో పోస్ట్ చేసి లక్నో అభిమానులందరికీ క్షమాపణలు తెలిపారు. భవిష్యత్తులో మరింత మెరుగైన ఏర్పాట్లతో పెద్ద వేదికపై కార్యక్రమం నిర్వహిస్తానని హామీ ఇచ్చారు. స్టార్ హీరో అయి ఉండి కూడా ఒక సాధారణ అభిమాని పోస్ట్‌కు స్పందించి, క్షమాపణ చెప్పడం పట్ల నెటిజన్లు వరుణ్‌ను అభినందిస్తున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే మరో కథానాయికగా నటిస్తోంది.