నాగర్‌కర్నూల్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఆలయం ముందు ఐదు దుకాణాల దగ్ధం

Maddimadugu Fire Accident Five Shops Gutted in Nagar Kurnool
  • షార్ట్ సర్క్యూటే కారణమని స్థానికుల అనుమానం
  • ఫైర్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే నష్టం జరిగిందని ఆరోపణలు
  • ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుల విజ్ఞప్తి
నాగర్‌కర్నూలు జిల్లాలోని పదర మండలం మద్దిమడుగు గ్రామంలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయం ముందు ఉన్న ఐదు దుకాణాలు మంటల్లో పూర్తిగా కాలిబూడిదయ్యాయి. ఈ ఘటన గత అర్ధరాత్రి జరిగింది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, తొలుత ఎండీ గౌస్ అనే వ్యక్తికి చెందిన దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే అవి పక్కనే ఉన్న నేనావత్ బోడి, శ్రీను, వెంకటేష్, మల్లేష్ గౌడ్‌లకు చెందిన దుకాణాలకు వ్యాపించాయి. గ్రామస్థులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ ప్రమాదంలో శ్రీను అనే వ్యాపారి కుటుంబం కట్టుబట్టలతో నిరాశ్రయులైనట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రమాదంపై ఫైర్ సిబ్బందికి సమాచారం అందించినా వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారని గ్రామస్థులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ఆపరేటర్ లేరని, వస్తున్నామని చెబుతూ కాలయాపన చేశారని, ఫైర్ ఇంజన్ ఘటనా స్థలానికి ఆలస్యంగా చేరుకునేసరికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని వాపోయారు.

ఈ అగ్నిప్రమాదంలో ఒక్కో దుకాణదారుడికి రూ.8 నుంచి 10 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితులు కన్నీటిపర్యంతమవుతున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ఘోరం జరిగిందని, ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. 
Go Back to Shorts
Maddimadugu Fire Accident
Nagar Kurnool Fire
Telangana Fire Accident
Maddimadugu
Pabbati Anjaneya Swamy Temple
Short Circuit Fire
Shop Fire Accident
Telangana News

More Telugu News