ఏపీలో ఎన్నికల వాయిదా నిలిపివేయాలన్న పిటిషన్పై రేపు ‘సుప్రీం’లో విచారణ
- ‘స్థానిక’ ఎన్నికల వాయిదా ఉత్తర్వుల రద్దుకు ఏపీ సర్కార్ పిటిషన్
- నిన్న సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు
- సీజేఐ బాబ్డే ఆధ్వర్యంలో విచారణకు అవకాశం
కాగా, ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ నెల 15న నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిని సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిన్న సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ ఉత్తర్వులు నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని ఆ పిటిషన్ లో కోరింది.