"మీ కుమార్తెగా బతకడానికి అర్హురాలిని కాదు" అంటూ బాలిక బలవన్మరణం

  • హైదరాబాద్ కేపీహెచ్ బీలో విషాదం
  • స్కూలు నుంచి ఇంటికి వచ్చి ఉరేసుకున్న బాలిక
  • కేసు నమోదు చేసుకున్న పోలీసులు
హైదరాబాదులోని కేపీహెచ్ బీ సర్దార్ పటేల్ నగర్ లో విషాదం చోటుచేసుకుంది. స్కూలు నుంచి ఇంటికి వచ్చిన ఓ బాలిక ఆత్మహత్య చేసుకుని తనువు చాలించింది. మియాపూర్ లో ఉన్న ఓ ప్రైవేటు స్కూల్లో చదువుతున్న 14 ఏళ్ల బాలిక స్కూలు ముగిసిన తర్వాత ఇంటికి వచ్చి నేరుగా తన గదిలోకి వెళ్లి ఉరేసుకుంది. బాలిక మృతితో కుటుంబసభ్యులు తల్లడిల్లిపోతున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ఘటన స్థలంలో సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. "మీ కుమార్తెగా బతికేందుకు నేను అర్హురాలిని కాదు" అని ఆ లేఖలో రాసి ఉంది.

Girl
Suicide
KPHB
Hyderabad
Police

More Telugu News