Corona Virus: కరోనా దృష్ట్యా మాస్కులు, శానిటైజర్లను నిత్యావసరాల జాబితాలో చేర్చిన కేంద్రం

Centre orders states to place masks and sanitizers in regular commodities list
షార్ట్స్‌లో చూడండి
దేశంలో కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక చర్యలు తీసుకుంటోంది. మాస్కులు, శానిటైజర్లను నిత్యావసరాల జాబితాలో చేర్చింది. కరోనా వ్యాప్తి కారణంగా వాటిని నిత్యావసరాల జాబితాలో చేర్చాలని రాష్ట్రాలకు సూచించింది. మాస్కులు, శానిటైజర్లను సామాన్యులకు తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. తక్కువ ధరకే అందించేలా చూడాలని స్పష్టం చేసింది. ఆదేశాలు అమలు చేయనివారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. సహాయకేంద్రాల నంబర్లు, నిత్యావసరాల జాబితా ప్రచురించాలని పేర్కొంది.
Go Back to Shorts
Corona Virus
India
Mask
Sanitizer

More Telugu News