Naga chaitanya: నాగచైతన్య– సాయిపల్లవి ‘లవ్​ స్టోరీ’ నుంచి లిరికల్​ సాంగ్​ విడుదల

From Love story movie a lyrical song released
షార్ట్స్‌లో చూడండి
నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్ స్టోరీ’. ఈ మూవీ లిరికల్ సాంగ్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ‘ఏ పిల్లా పరుగున పోదామా.. ఏ వైపో జంటగా ఉందామా.. రారా కంచే దూకి..‘ అంటూ ఈ సాంగ్ సాగింది. ఈ పాటను చైతన్య పింగళి రచించారు. హరిచరణ్ ఆలపించగా, పవన్ హెచ్ సంగీతం అందించారు. కాగా, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి నిర్మాతలుగా నారాయణ్ దాస్ కె నారంగ్, పి.రామ్మోహన్ రావులు వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.


Go Back to Shorts
Naga chaitanya
Sai Pallavi
Love story
Lyrical song

More Telugu News