మా దేవుడు చంద్రబాబుపై నేను ప్రమాణం చేస్తా, మీ జగన్ పై నువ్వు ప్రమాణం చెయ్!: పిన్నెల్లికి బుద్ధా సవాల్
- మాచర్ల దాడి ఘటనలో పిన్నెల్లిని నిలదీసిన వెంకన్న
- దాడి వెనుక ఉన్నది పిన్నెల్లేనని ఆరోపణ
- వైసీపీ నేతల సంస్కృతే అంత! అంటూ విమర్శలు
"కానీ మీకు జరిగే క్లాసులు వేరే. మీ నాయకుడేమో ఎలా దోచుకోవాలి, ఎలా దాచుకోవాలి, చంపడం, నరకడం నేర్పిస్తారు. దాడి జరిగిన ఐదు నిమిషాల్లోనే తప్పుడు ప్రకటనతో మీ నైజం చాటుకున్నారు. ఇప్పుడు నేనేదో అది చేస్తాను, ఇది చేస్తాను అనడంలేదు. మాకు దైవం చంద్రబాబునాయుడే. బోండా ఉమ చెప్పిందంతా నిజమేనని మా దేవుడు చంద్రబాబుపై ప్రమాణం చేస్తా. నువ్వు చెప్పేదంతా నిజమని నీ నాయకుడు జగన్ పై ప్రమాణం చేయాలి. నువ్వు ప్రమాణం చేశావంటే మీ కార్యకర్తలకు తెలిసిపోతుంది... తప్పుడు ప్రమాణం చేశావని. నువ్వు జగన్ పై ప్రమాణం చేశావంటే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా... ఈ చాలెంజ్ కు సిద్ధమేనా?" అంటూ పిన్నెల్లికి బుద్ధా సవాల్ విసిరారు.