Bonda Uma: బోండా ఉమ, బుద్ధా వెంకన్నలపై వైసీపీ కార్యకర్తల దాడి.. కారు ధ్వంసం, గాయాలు

YSRCP supporters attacks Bonda Uma and Budda Venkanna
షార్ట్స్‌లో చూడండి
టీడీపీ నేతలు బోండా ఉమ, బుద్ధా వెంకన్నలపై వైసీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. వారు ప్రయాణిస్తున్న కారును ధ్వంసం చేశారు. గుంటూరు జిల్లా మాచర్లలో ఈ ఘటన చోటు చేసుకుంది. టీడీపీ నేతలు వస్తున్నారన్న ముందస్తు సమాచారంతో కాపు కాసి, వీరిపై వైసీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలోనే ఈ దాడి జరిగింది.

టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా వైసీపీ అడ్డుకుంటోందనే వార్తలతో... వాకబు చేసేందుకు వీరు మాచర్లకు వచ్చారు. ఈ సందర్భంలో వారిపై దాడి జరిగింది. పెద్ద కర్రతో ఓ వ్యక్తి కారు అద్దాలను పగలగొట్టాడు. అయితే డ్రైవర్ కారును ఆపకుండా అక్కడి నుంచి ముందుకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత కూడా వారి వాహనాన్ని వెంటాడే ప్రయత్నం చేశారు. ఈ దాడిలో ఇద్దరు నేతలకు గాయాలయ్యాయి. వారి శరీరం నుంచి రక్తం కారింది. ఈ ఘటనతో మాచర్లలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Go Back to Shorts
Bonda Uma
Budda Venkanna
Telugudesam
Attack
YSRCP

More Telugu News