టీడీపీ మాజీ ఎమ్మెల్యే అనితను అడ్డుకున్న పోలీసులు

Police stops TDP leader Anitha
  • టీడీపీ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమానికి హాజరైన అనిత
  • జిల్లాపరిషత్ కార్యాలయం వద్ద అడ్డుకున్న పోలీసులు
  • ఇదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యే అమర్ కు అనుమతి
తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే అనితను పోలీసులు అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళ్తే, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అభ్యర్థుల తరపున నామినేషన్ కార్యక్రమానికి అనిత హాజరయ్యారు. ఈ సందర్భంగా విశాఖపట్టణం జిల్లాపరిషత్ కార్యాలయంలోకి వెళ్లకుండా ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. ఇదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యే అమర్ ను మాత్రం వారు లోపలికి అనుమతించారు. దీంతో, పోలీసుల తీరుపై అనిత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమకు ఒక న్యాయం, అధికార పార్టీ నేతలకు మరో న్యాయమా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Go Back to Shorts
Anitha
Telugudesam
Vizag
YSRCP

More Telugu News