కరోనా ఎఫెక్ట్... ఈ నెలాఖరు వరకు కేరళలో సినిమా హాళ్ల మూసివేత
- కేరళలో పెరుగుతున్న కరోనా కేసులు
- మార్చి 31 వరకు సినిమా థియేటర్లు మూసివేయాలన్న ప్రభుత్వం
- పెళ్లిళ్లు మినహా ఇతర శుభకార్యాలు వాయిదా వేసుకోవాలని సూచన
అంతేకాదు, వివాహాలు మినహా ఇతర కార్యాలను వాయిదా వేసుకోవాలని సూచించారు. పెళ్లిళ్లకు కూడా అతి దగ్గరి బంధువులు మాత్రమే హాజరయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. సీఎం పి.విజయన్ అధ్యక్షతన కేరళలో ఇవాళ అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. కేరళలో కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది.