Corona Virus: కరోనా ప్రభావం: టాయిలెట్ పేపర్ల కోసం జుట్టు పట్టుకుని కొట్టుకున్న మహిళలు.. వీడియో వైరల్‌

Toilet paper shortage from coronavirus panic buying sees fight break out
షార్ట్స్‌లో చూడండి
కరోనా ప్రభావంతో మాస్కులు, టాయిలెట్‌ పేపర్ల కొరత ఏర్పడుతోంది. దీంతో షాపింగ్‌ మాల్‌లో టాయిలెట్‌ పేపర్ల కోసం కొందరు మహిళలు జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉన్న ఓ సూపర్‌మార్కెట్‌లో చోటు చేసుకుంది.

ఆ షాపింగ్‌ మాల్‌లో కొన్ని టాయిలెట్‌ పేపర్లు మాత్రమే ఉన్నాయి. అవి తమకే కావాంలటూ ముగ్గురు మహిళలు కొట్టుకోవడం ఈ వీడియోలో కనపడుతోంది. ఓ మహిళ జట్టును మరో మహిళ పట్టుకుని కొట్టింది. దీంతో సూపర్‌ మార్కెట్ సిబ్బంది జోక్యం చేసుకుని వారిని విడిపించారు. ఇటీవల జరిగిన ఈ ఘటనను ఓ న్యూస్‌ ఛానెల్‌ తమ యూట్యూబ్‌లో పోస్ట్ చేసింది.

Go Back to Shorts
Corona Virus
Australia
Viral Videos

More Telugu News