నాకే బర్త్ సర్టిఫికెట్ లేదు, ఇక మా నాయనది తీసుకురమ్మంటే ఎలా?: సీఎం కేసీఆర్
- నేను మా ఊళ్లో సొంతింట్లో పుట్టాను
- అప్పుడు దవాఖానాలు లేవు.. నాకు బర్త్ సర్టిఫికెట్ లేదు
- ‘నువ్వెవరు?’ అని ప్రశ్నిస్తే ఏం చెప్పాలి?
‘నేను మా ఊళ్లో సొంతింట్లో పుట్టాను. అప్పుడు దవాఖానాలు లేవు. నాకే బర్త్ సర్టిఫికెట్ లేదు. నువ్వెవరు? అంటే ఏం చెప్పాలి? హౌ డూ ఐ ప్రూఫ్? ఆ కాలంలో పెద్దలు ఊళ్లో ఉన్న అయ్యగారిని పిలిపించి ‘జన్మనామం’ అని రాయించేవాళ్లు. అదే బర్త్ సర్టిఫికెట్. దానికి అఫిషియల్ ముద్ర ఉండదు. ఇప్పటికి కూడా నా జన్మనామం నా దగ్గర ఉంది. మా వైఫ్ దగ్గర ఉంది. ఆ రోజున ఆసుపత్రులు, ఈ రికార్డులు లేవు. నాదే దిక్కులేదంటే, ‘మీ నాయనది తీసుకురమ్మంటే’ నేను చావాలనా? మాకు 580 ఎకరాల జాగా, పెద్ద బిల్డింగ్ ఉంది. అలాంటి కుటుంబంలో పుట్టిన నాకే బర్త్ సర్టిఫికెట్ లేకపోతే దళితులకు, నిరుపేద ప్రజలకు ఎక్కడిది? వివరాలు తెమ్మంటే యాడ తేవాలి?’ అని ప్రశ్నించారు. దీనికి బదులు నేషనల్ ఐడెంటి కార్డు పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.